Press "Enter" to skip to content

తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్స్ 2023 ఏ వైపుగా సాగుతున్నాయి?

Tharun Thatikonda

This is the second article in a series of articles (తెలంగాణ రాజకీయ పరిస్థితుల అవలోకన) written by Tharun Thatikonda on Telangana Elections 2023. Please read the first article here.

ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి పోటీ BRS మరియు కాంగ్రెస్ మధ్య వుంది, నేటికి కూడా అలానే కొనసాగుతుంది. నామినేషన్ల ప్రక్రియ ముగిసి, ప్రధాన పార్టీల అభ్యర్థులు ఎవరు అనే విషయంలో స్పష్టత వచ్చిన తర్వాత కొని స్థానాలో ప్రధాన పార్టీల (BRS, బీజేపీ, కాంగ్రెస్) మధ్య పోటీ గట్టిగా వుంది. వివిధ సర్వేలు, ప్రజాభిప్రాయం, ఇతర వర్గాల అంచనా ప్రకారం రాష్ట్రంలో 33 స్థానాలో (అంటే రాష్ట్రంలో ఉన్న స్థానాల్లో 27%) త్రిముఖ పోటీ ఉండబోతుంది!

త్రిముఖ పోటీకి నేను ఇచ్చే నిర్వచనం: ఎ నియోజకవర్గంలో అయితే ప్రధాన పార్టీల అభ్యర్థులు బలంగా ఉంటారో అవీ త్రిముఖ పోటీ వుండే నియోజకవర్గం అని అనవచ్చు. నా అంచనా ప్రకారం ఈ 33 నియోజకవర్గలులో ఏ పార్టీ అయితే అధిక సీట్స్ గెలుస్తుందో అ పార్టీకే అధికారం చేపటే అవకాశాలు ఎకువగా ఉన్నాయి, పై చెప్పిన నియోజకవర్గాల్లో కొన్ని (2/3) ప్రస్తుత మంత్రివర్గంలో వున్న మంత్రులు పోటీ చేసే స్థానాలు కూడా ఉన్నాయి. 

అయితే మనం ముందుగా చేపుకున్న ప్రకారం పోటీ ఇప్పటికి BRS vs Congress గా ఉన్నా, BJP కూడా పైన చెప్పుకున్న స్థానాల్లో బలమైన అభ్యర్ధులని పోటీలో నిలిపింది. సాధారణంగా త్రిముఖ పోటీ ఉన్నప్పుడు గెలిచిన మరియు ఓడిపోయిన అభ్యర్థి మధ్య వుండే ఓట్ల వేతాస్యం చాలా తక్కువగా ఉంటుంది. ఉదాహరణకి కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గం తీసుకుంటే అక్కడ గత రెండు అసెంబ్లీ ఎలక్షన్లో త్రిముఖ పోటీ వుండటం వల్ల గెలిచిన అభ్యర్థి మెజారిటీ స్వల్పంగా వుంది. 

2018 ఎలక్షన్లో అప్పటి TRS (ప్రస్తుత BRS) ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే గూర్ఖా జైపాల్ యాదవ్ తన సమీప ప్రత్యర్థి అయిన ఆచారి తల్లోజు (BJP) మీద 3,447 ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఇదే నియోజకవర్గంలో 2014 ఎలక్షన్స్లో కాంగ్రెస్ అభ్యర్థి చల్లా వంశీచంద్ రెడ్డి, బీజేపీకి చెందిన ఆచారి తల్లోజు పై కేవలం “32” ఓట్స్ తేడాతో గెలిచారు, పై రెండుసార్లు మూడో స్థానంలో అభ్యర్ధికి వచ్చిన ఓట్లు 30,000 పైచిలుకే!

త్రిముఖపోరు ఉన్నప్పుడు పోటీ ఎంత తీవ్రంగా వుంటుంది అనీ చెప్పటానికి కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గం ఫలితం నుంచి మనం గమనించవచ్చు. అక్కడ పార్టీల మేనిఫెస్టో, విధానాలు, అగ్రనాయకం కంటే కూడా స్థానిక నాయకుడికి ఉన్న బలం పైన గెలుపు-ఓటములు ఎక్కువగా ఆధారపడి ఉంటాయి.

గడిచిన కొన్ని రోజులుగా BJP ఇచ్చిన హామీలు (BC సీఎం, SC వర్గీకరణకి అనుకూలం అని చేసిన ప్రకటన) వల్ల పార్టీకి కాస్త మైలేజ్ వచ్చింది. త్రిముఖపోరు ఉన్నచోట ఆ పార్టీ ఎవరి ఓట్లు చిల్లుస్తుంది అనేది పెద్దప్రశ్న! 

ఈ 33 నియోజకవర్గలులో మూడురకాల సాధ్యాసాధ్యాలు  ఉన్నాయి:

1. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి అధికార BRS పార్టీకి లాభం చేకూరటం (BRS పార్టీ అభ్యర్థి గెలుపు)

2. ఓటు చీలిక అనే అంశం ప్రభావం లేకుంట, ప్రధాన ప్రతిపక్షం అయిన Congress ఎక్కువ సీట్లు గెలవడం. (రాజకీయం ఎప్పుడు కూడా 1+1 అంటే 2 కాదు, అది 11 కూడా కావచ్చు!)

3) BC సీఎం, SC వర్గీకరణ హామి వల్ల BJP చెప్పుకోదగ్గ స్థానాలు గెలవడం 

నా అంచనా ప్రకారం పై మూడిట్లో ఏది జరుగుతుందో చెప్పటం కొంచెం కష్టం అయిన పని. త్రిముఖ పోరులో ఒక్క ఓటు కూడా కీలకంగా మారుతుంది, కానీ స్థూలంగా ఒక అభిప్రాయం చెపవచ్చు. 33 స్థానాల్లో BJP ఎక్కువ సీట్లు గెలుస్తే రాష్ట్రంలో హంగ్ అసెంబ్లీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. లేదు అంటే BRS లేదా Congress అధికారంలోకి వస్తాయి. పైన చెప్పుకున్న 33 నియోజకవర్గాల పేర్లు, అక్కడ పోటీచేసే ప్రధాన పార్టీలు (BRS, BJP, Congress) అభ్యర్థుల వివరాలు క్రింద ఇచ్చిన టేబుల్లో చూడవచ్చు.