Tharun Thatikonda
This is the first article in a series of articles (తెలంగాణ రాజకీయ పరిస్థితుల అవలోకన) written by Tharun Thatikonda on Telangana Elections 2023. Please read the second article here.

2023 తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఎవరు గెలుస్తారు అని చెప్పడం కొంచెం కష్టం.
ఎవరు గెలుస్తారు అని చెప్పడం కష్టం అయినా, ప్రధానంగా పోటి మాత్రం BRS అలియాస్ TRS వెర్సస్ Congress గా ఉండబోతుంది.
బిజెపి పార్టీ 2019 లోకసభ ఎలక్షన్స్ తరువాత పుంజుకొని, గత కొద్ది నెలలుగా జరిగిన పరిణామాల వల్ల అ పార్టీ బాగా వెనకపడింది. ప్రస్తుత పరిస్థులో అ పార్టీ 5 సీట్స్ కి మించి గెలవదు అని నా అభిప్రాయం.
ఎంఐఎం పార్టీ ఇప్పుడు ఉన్న 7 స్థానాలు నిలబెటుకుంటుంది, కానీ ఈ సారీ ఎక్కువ సిట్స్ లో పోటీచేస్తాం అని చెప్పారు. ఎంఐఎం ఎక్కువ సీట్స్ లో పోటీచేయటం వల్ల కొన్ని స్థానాలో ఓట్స్ చీలే అవకాశం వుంది, అది అధికార పార్టీ BRSకి లాభం చేకూరుస్తుంది.
బీఎస్పీ పార్టీ ప్రజలలో బానే ఉన్నా, అది సీట్స్ గెలిచే అవకాశం అంతగా లేదు. అ పార్టీ తెలంగాణ ప్రెసిడెంట్ అయినా RS Praveen Kumar గారు సిర్పూర్ నుంచి పోటీ చేస్తున్నారు, వారు గెలిచే అవకాశాలు ఉన్నాయి.
YSRTP పార్టీ పరిస్థితి రెంటీకి చెడ్డ రేవడి లా అయింది. ఈ పార్టీ పైన మొదిటి నుంచి ఎక్కువగా ఆశలు ఏమిలేవు. అ పార్టీ అదినేత్రి Y. S. Sharmila మొదటిలో పాదయాత్రా అని హడావుడి చేసినా, అ తర్వాత కాంగ్రెస్లో విల్లీనం అనే దారిలో వెళ్ళింది ఆది కుదరక పోవటం వల్ల ఇప్పుడు ఒంటరి గానే పోటీ చేయాలి అనీ నిర్ణయం తీసుకున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఈ పార్టీ కొంచెం ప్రభావం చూపే అవకాశం ఉంది. నా అంచనా ప్రకారం ఈ పార్టీకి ఒక్క సీట్ కూడా గెలిచే అవకాశం లేదు.
ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న పార్టీలా పరిస్థులు ప్రకారం ఓక 13 సీట్స్కి లెక్క తేలింది.
అక్కడ అక్కడ ఇండిపెండెంట్ అండ్ పార్టీ టికెట్ ఆశించి రాని వారు ఉంటారు వాళ్లకి ఓక 2 సీట్స్ గెలిచే అవకాశం వుంది అనుకుంటే మొత్తం మీద ఒక 15 సీట్స్కీ లెక్క తేలింది.
తెలంగాణ ఆసెంబ్లీలో మొత్తం 119 సీట్స్ ఉన్నాయి, వాటిలో పై 15 తీసివేస్తే ఇంకా మిగిలిన సీట్స్ సంఖ్య 104.
నేను ఇప్పటి వరకు వామపక్షాలు మరియు Prof కోదండరాం పార్టీ తెలంగాణ జన సమితి గురించి ఎందుకు ప్రస్తావించలేదు అంటే అ పార్టీలు Congress పార్టీతో పొత్తు చర్చల్లో ఉన్నాయి, అందుకే అవి కాంగ్రెస్ కూటమిలో భాగంగా చూడటం జర్గుతుంది.
2018 డిసెంబర్లో జరిగిన ఎలక్షన్స్లో TRS పార్టీ 88 సీట్స్లో గెలిచి రెండోసారి అధికారంలోకి వచ్చింది, ఆ తర్వాత జరిగిన పరిణామాలు (బైలెక్షన్స్, ఎమ్మెల్యేలు పార్టీ మారడం మరియు ఇతరాతర కారణాలు) వల్ల ఇపుడు అసెంబ్లీలో అ పార్టీ బలం 98కీ చేరుకుంది.
Congress పార్టీ 2018లో 19 సీట్స్ గెలుస్తే, ఇపుడు అవి 9కి చేరుకున్నాయి అంటే ఒక ప్రధాన ప్రతిపక్షం 5 years లో 10 సీట్స్ కొలిపొయిందు, అవిధంగా చూసుకుంటే కాంగ్రెస్ బాగా బలహీన పడింది అని అర్థం.
మనం పైన చెప్పుకున్న పరిస్థితులు అంతా 2023 ఆరంభం వరకు ఉన్నవి, ఎప్పుడు అయితే కర్నాటక ఎలక్షన్లో కాంగ్రెస్ విజయం సాధించిందో అప్పటి నుంచి తెలంగాణ రాష్ట్రంలో రాజీకీయ పరిస్థితులు వేగంగా మారుతు వచ్చాయి.
అప్పటి వరకు వేగంగా దూసుకొని వెళ్ళుతున్న BJP కాస్త నెమది ఇచ్చింది, దానికి తోడుగా అ పార్టీ రాష్ట్ర ప్రెసిడెంట్ మార్పు అ పార్టీని 2వ స్థానం నుంచి 3వ స్థానంకి పడివేసింది.
ప్రజలలో బిజెపి మరుయు BRSకీ లోపాయికారి ఒప్పందం వున్నది అనే భావన నానాటికి బలపడుతుంది, అది BJP పార్టీకి నష్టం చేస్తుంది.
ఇకా మనం ప్రస్తుత అధికార పార్టీ అయినా BRS గురుంచి మాట్లాడుకుందాం, ఒక పార్టీ రెండుసారులు వరసగా అధికారంలో వుంది అంటే అ పార్టీ మీద ప్రజలలో అసంతృప్తి ఉండటం సర్వసహజం.
తెలంగాణ ఉద్యమం ప్రధాన నినాదం అయిన నీళ్లు, నిధులు, నియామకాలు ఈ 10 ఏళ్లులో ఎంతవరకు సాకారం చేశారు అనేదే పెద్ద ప్రశ్న.
మనం ప్రధానంగా నియామకాలు గురించి చర్చించుదాం, తెలంగాణ ఉద్యమం సమయంలో సరిగా జాబ్ నోటిఫికేషన్స్ లేవు, ఏవో అరకొర వచ్చిన అప్పుడు ఉద్యమకారులు తెలంగాణ రాష్ట్రం వేరుపడక సొంత రాష్టంలో మా నియామకాలు మేము చేసుకుంటాం అని అందోళోన చేయటం వల్ల తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావంకీ 5 యేళ్లు ముందునుండి పెద్దగా ఉద్యాగాలు ఏవీ నింపలేదు.
మలిదశ అయినా తొలిదశ ఉద్యమం సమయంలో విద్యార్థులు చూర్కుగా ఉండటానికి కారణం స్వరాష్ట్రం వస్తే ఉపాది అవకాశాలు మెరుగ వుంటాయి అనే భావనాతో ఉన్నారు.
అధికారంలోకి వచ్చిన తోలిరోజులు నుండి కాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలని భర్తీ చేయటంలో అంతగా ఆసక్తి చూపలేదు.
ప్రభుత్వం ఎంతో గొప్పగా చెప్పిన టీఎస్పీఎస్సీ (TSPSC) పనితీరు పైనపటారం లోనలోటారం లా మారింది. 2014-2018 వరకు అ సంస్థ పనితీరు పర్వలేదు అనిపించినా, 2019 నుంచి మాత్రం అక్రమాలకు అడ్డాగా మారింది.
అక్రమాలు, అవకతవకులు, పేపర్ లీకేజీలు, పరీక్ష రద్దు పరిపాటుగు మారినాయి, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయ్యాక ఇంతవరకు ఒక్క గ్రూప్1 పోస్ట్ కూడా భర్తీ చేయలేదు అంటే ఎంత దారుణంగా అ సంస్థ పనితీరు ఉందో అర్థమవుతుంది.
టీఎస్పీఎస్సీతో పాటు, ఇతర నియామక వ్యవస్థలు పనితీరు కూడా అంత గొప్పగా ఏమిలేదు, ప్రతి నియామక ప్రక్రియలోనూ అవినీతి ఆరోపణలు, కోర్ట్ కేస్సులు సర్వసాధార్ణం అయిపోయాయి.
2018 ఎలక్షన్స్ మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన నిరుద్యోగభృతి గురుంచి మాట్లాడుకోవటం అనవసరం.
నియామకాల విషయంలో ఈ ప్రభుత్వం దారుణంగా విఫలం అయింది, యువత మరియు చదువుకున్న వర్గాలు ఈ విషయంలో ప్రభుత్వం పై ఆగ్రహంగా ఉన్నారు.
నీళ్ల విషయంలో ఇంతకముందు కంటే పరిస్థులు మెరుగుపడినా, అనవసరంగా ప్రాజెక్ట్స్ రీడిజైన్ చేసి ప్రజల పై భారం మోపారు అనే భావన వుంది.
ప్రభుత్వం ఏంతో గొప్పగా ప్రచారం చేసుకున్న కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పై వచ్చిన ఆరోపణులు, మరియు అ ప్రాజెక్ట్ మోటార్స్ నీట మునిగనపుడు ప్రభుత్వ స్పందన వివాదం అయింది.
నిధులు విషయానికి వస్తే, సొంత రాష్ట్రం వచ్చిన తరువాత రాష్ట్ర ఆదాయం పెరిగిన అది అన్ని వర్గాలుకు మరియు ప్రాంతాలకు సమానంగా అందలేదు అనేది వాస్తవం.
ఈనాటికి కూడా తెలంగాణలో హైదరాబాద్ తప్పుతే గట్టిగా చెప్పుకునే మరో పెద్ద నగరం లేదు. వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నల్లగొండ లాంటీ ధృతియశ్రేణి నగరాలువున వాట్టి అభివృద్ధి చెపుకోదగ విధంగా ఏమేలేదు.
ప్రభుత్వంలో కిల్లకంగా ఉన్న కేసీఆర్, కేటీఆర్, హరీష్రావు (Harishrao)లా నియోజికవర్గాలో జరిగిన అభివృద్ధికీ, మరుయు వేరే నియోజికవర్గాలో అభివృద్ధికీ నక్కకి నాగలోకంకీ ఉన్నంత తేడావుంది, ప్రజలలో కూడా ఈ అభిప్రాయము ఉంది. దీనివల్ల అధికారం అంత అ ముగ్గురి చేతిలోనే వుంది అనే భావన బాగా ఎక్కువ అయింది. కొంతమంది మంత్రులు పేరుకే మాకు పదవి, అధికారం అంతా కేంద్రీకూతం అయింది అని చెప్పటం పరిపాలన వైపల్యంనీ ఎత్తిచూప్తుంది.
TRS/BRS ప్రభుత్వంలో అభివృద్ధి జర్గలేదు అని నేను ఏమి చేపట్లేదు, జరిగిన అభివృద్ధి కొంత వర్గాలకు, ప్రాంతాలుకే పరిమితం అయింది అనే వాస్తవంనీ మీ ముందు ఉంచుతున్నాను.
కర్ణుడు చావుకు వెయ్యి కారణాలు అన్నట్లు ఈ ప్రభుత్వం పై వ్యతిరేకత పెరగడానికి అనేక కారణాలు వున్నాయి, ఆ ఆ నియోజికవర్గాలో ఉన్న స్థానిక సమస్యలు, ఎమ్మెల్యే పనితీరు కూడా కరణాలు.
ఇప్పటి పరిస్థితుల ప్రకారం చూస్తే కాంగ్రెస్, BRS హోరాహోరీగా తలపడడం తథ్యం, ఎ పార్టీ బల బలాలు విజయవకాశాలు ఏలా ఉన్నాయి ఆని మరో ఆర్టికల్లో వివరంగా చర్చించుకుందాం.